కాట్రేనికోన పంచాయతీగచ్చకాయలపోరలో బొమ్మేడి బాలరాజుకు చెందినరొయ్యలు చెరువులో గుర్తుతెలియని దుండగులు విషం కలిపారు, రొయ్యలు మృత్యువాత పడి సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లింది. భోజనం సమయంలో ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి చెరువు వద్ద క్రిమి సంహారక మందు కలిపినట్టు గుర్తించారు. చెరువులో రొయ్య అన్నీ చనిపోయాయి. ఈ మేరకు రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు.