కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామానికి చెందిన కొత్తపెల్లి సీతమ్మ అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందింది. మృతదేహాన్ని కాట్రేనికోన తీసుకొస్తుండగా భర్త సుబ్బారావు భోరున విలపిస్తూ ప్రాణాలు వదిలాడు. దీంతో బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. భార్యా భర్తలు ఎంతో అన్యోన్యంగా జీవించేవారని చుట్టుపక్కల వారు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.