గత నెలలో జరిగిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పుట్టినరోజును పురష్కరించకుని మల్లాడి యూత్ యానాంలోని వృద్ధాశ్రమంలో శనివారం నిర్వహించిన రక్త దాన శిబిరంలో 91 మంది యువకులు పాల్గొన్నారు. మల్లాడి కృష్ణారావు దాతలను అభినందిస్తూ మెమెంటోలు, ధ్రువపత్రాలు అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడమంటే మరొకరికి ప్రాణదానం చేయడమే అని అన్నారు.