రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగునుంది. ఈ నేపథ్యంలో సోమవారం ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం నుంచి కాపు కళ్యాణమండపం వరకు ఇన్ చార్జ్ కమిషనర్ సుధాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమములో మేనేజర్ నూకరాజు, టీపీఓ శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ, మెప్మా, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.