అమెరికా జలపాతంలో చాగల్లు యువకుడు గల్లంతు

9చూసినవారు
అమెరికా జలపాతంలో చాగల్లు యువకుడు గల్లంతు
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాలకు చెందిన హరికిరణ్ గౌడ్ (25) అమెరికాలోని ఓ జలపాతంలో గల్లంతయ్యాడు. ఎంఎస్ చదవడానికి 2023లో అమెరికా వెళ్లిన హరికిరణ్, కాన్సస్ రాష్ట్రం ఓవర్ల్యాండ్ పార్క్‌లో ఉంటూ తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం స్నేహితులతో కలిసి జలపాతానికి వెళ్లిన అతడు గల్లంతయ్యాడని శనివారం కుటుంబానికి సమాచారం వచ్చింది. కాగా హరికిరణ్ తండ్రి రామకృష్ణ పీఎంపీ వైద్యుడిగా గ్రామస్థులకు సుపరిచితుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. హరికిరణ్ పెద్దకుమారుడు.

సంబంధిత పోస్ట్