రానున్న రోజుల్లో పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల మేధస్సు పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జనసేన పెరవలి మండలాధ్యక్షుడు రవికుమార్ అన్నారు. శుక్రవారం పెరవలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్లను అందజేశారు. మంత్రి దుర్గేశ్, మాజీ ఎమ్మెల్యే శేషారావు సహకారంతో పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సర్పంచ్ సీతమ్మ, ఎంపీటీసీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.