నిడదవోలు పట్టణంలో గత కొద్దిరోజులుగా కుక్కల బెడద పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నిడదవోలు పట్టణంలోని ప్రధాన సెంటర్లైన గణపతి సెంటర్, గణేశ్ చౌక్ సెంటర్, బస్టాండ్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం ఏరియా, ఆర్ఓబి వద్ద రహదారులపైనే సంచరిస్తూ ఉండడంతో వాహనదారులతో పాటు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా ద్విచక్ర వాహనాల వెంట కుక్కలు పడుతుండడంతో వారు పడి గాయాల పాలవుతున్నారు.