దుద్దుకూరు: కేంద్రీకృత అవగాహన

76చూసినవారు
దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో సోమవారం ఖరీఫ్ ఏక్షన్ ప్లాన్-2025 పథకం ద్వారా పీఎండీసీ నవధాన్యాల సాగు ఫై, కేంద్రీకృత అవగాహన, ప్రేరణాత్మక ప్రచారం సోమవారం పల్లెకు వీధివీధి తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ యూనిట్ ఇంచార్జ్ మాట్లాడుతూ.. ప్రకృతివ్యవసాయం చెయ్యండి, భూమికి జీవం పోయండి, దేశిరకాల వాడకం, మాయదారిరోగాలకి నిరోధకం, జైనేలతల్లిఅని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐ సి ఆర్ పి లు రాంబాబు, రాజు, రామలక్ష్మి, కస్తూరి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్