దుద్దుకూరు: 14న విద్యుత్ సరఫరాకి అంతరాయం

73చూసినవారు
దుద్దుకూరు: 14న విద్యుత్ సరఫరాకి అంతరాయం
దేవరపల్లి మండలంలో 33/11కేవీ సబ్ స్టేషన్ మరమ్మతుల నిమిత్తం బుధవారం దుద్దుకూరు ఆర్డీఎస్ఎస్ వర్క్స్, ట్రాన్స్ ఫార్మర్ లు, నూతన విద్యుత్ లైన్ లు ఏర్పాటు చేయుటకు రూరల్ ఫిడర్ పరిధిలో సరఫరాకు అంతరాయం ఉంటుందని నిడదవోలు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నారాయణ అప్పారావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాకి అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్