నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా పీ4 విధానం అమలుపై మంత్రి కందుల దుర్గేష్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే మండలంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.