పెరవలి మండలంలోని నడుపల్లిలో సోమవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా చక్కగా ఉపయోగపడుతుందని, ప్రతీ ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సర్పంచ్ సత్యవేణి రాజు అన్నారు. యోగాపై ప్రజలను చైతన్య పరుస్తూ సోమవారం ర్యాలీ చేపట్టారు. కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.