నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువైన శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం వద్ద యోగా గురువు సానెపు వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, గ్రామస్తులతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వి. హరి సూర్య ప్రకాశ్, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.