దేవరపల్లి మండల కేంద్రంలో జనసేన ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ హాజరై మాట్లాడారు. తాము కుర్చీలలో కూర్చోవడానికి కారణం కార్యకర్తల కష్టమే అని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన ఇన్‌ఛార్జి సువర్ణరాజు పాల్గొన్నారు.