నల్లజర్ల మండలం ముసుళ్లకుంట గ్రామంలో సోమవారం సర్పంచ్ నందమూరి శారదా దేవి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సింహాద్రి రావు, సర్పంచ్ నందమూరి శారదా దేవి, నందమూరి రామకృష్ణ, పలువురు వార్డ్ మెంబర్లు ఉన్నారు.