నిడదవోలులోని అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండటమే పరిష్కారమని అన్నారు.