నిడదవోలు: పెత్తందారులపై కేసులు నమోదు చేయాలి

54చూసినవారు
నిడదవోలు: పెత్తందారులపై కేసులు నమోదు చేయాలి
దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన పెత్తందారులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తూ. గో జిల్లా కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గుడ్లురు మండలం దప్పళంపాడు దళితుల పై సామాజిక బహిష్కరణ చేసిన పెత్తందారుల అమానవీయ ఘటనపై బుధవారం నిడదవోలులో కేసీపీఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్