న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్లో భాగంగా నిడదవోలు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మార్చి నెల 8వ తేదిన నిడదవోలు కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నిడదవోలు సివిల్ జడ్జి జి. రామకృష్ణ గురువారం తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.