రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నిడదవోలులో ఎమ్మెల్యే సంత మార్కెట్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. జై భీమ్, జై భారత్ అని నినాదాలు చేశారు.