నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ బుధవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఎవరైనా క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని పేర్కొన్నారు.