నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థి తుము వివిఎస్ఎస్ శ్రీరామ్ స్వరూప్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా సోమవారం మంత్రి కందుల దుర్గేష్ ను నిడదవోలులో శ్రీరామ్ స్వరూప్ కలిసారు. ఎంతో కష్టపడి మంచి మార్కులు (992/1000) సాధించిన శ్రీరామ్ స్వరూప్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆశీర్వదించారు.