నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం గ్రామంలో రూ. 9. 83 లక్షల అంచనా వ్యయంతో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అదనంగా నిర్మించిన 6 పడకల ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్ (ECRP) యూనిట్ భవనాన్ని మంత్రి కoదుల దుర్గేష్, ఏపీఎస్ఎస్ డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి బుధవారం ప్రారంభిoచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు.