నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, పెరవలి దీప్తి ఫంక్షన్ హాల్ నందు పెరవలి లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. కార్యవర్గ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కుక్కలకు టీకాలు వేయించడం వల్ల రాబిస్ వ్యాధి రాకుండా రక్షణ పొందవచ్చు అన్నారు.