నిడదవోలులోని గణేష్ చౌక్ సెంటర్ నుంచి సమిశ్ర గూడెం వంతెన వరకు నిత్యం రద్దీగా ఉంటుంది. పంగిడి నుంచి నరసాపురం వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ రహదారిలో మూగజీవులు మంగళవారం రాత్రి విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఈ రహదారిలో స్కూల్ బస్సులు, లారీలు, ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. పశువులను గమనించుకోకుండా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతో మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.