మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ అన్నారు. ఆదివారం సాయంత్రం నిడదవోలు పట్టణ గణపతి సెంటర్ లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడుపుతున్న పలువురు యువకులకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమహంస ఉన్నారు.