నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం పెరవలి మండలం అన్నవరప్పాడులో వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బౌద్ధ పీఠం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక నాయకులతో భేటీ అయ్యి కార్యకర్తలు, నాయకులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని అన్నారు.