పెద్దాపురం డివిజన్లో 899 మంది ఉపాధ్యాయ ఓటర్లు
By మొగలి నాగేంద్ర 69చూసినవారుపెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో 11 మండలాల్లో డిసెంబర్ 5వ తేదీన నిర్వహించే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు శుక్రవారం ఆర్డీవో కె. శ్రీరమణి తెలిపారు. డివిజన్లో 899 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. జగ్గంపేటలో 43, ఏలేశ్వరంలో 101, ప్రత్తిపాడు 72, శంఖవరం 54, రౌతులపూడి 43, తుని 261, తొండంగి 61, కిర్లంపూడి 53, పెద్దాపురం 156, గండేపల్లి 32 మంది ఓటర్లు ఉన్నారన్నారు.