సామర్లకోట ఫ్లైఓవర్‌పై ఆటో బోల్తా

55చూసినవారు
సామర్లకోట ఫ్లైఓవర్‌పై ఆటో బోల్తా
సామర్లకోట ఫ్లైఓవర్‌పై ఆదివారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. మురారి గ్రామం నుంచి పనసపాడు వెళ్తుండగా ఫ్లైఓవర్ వద్ద ఆటో అదుపుతప్పి బొల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్సై అడపా గరగరావు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్