పెద్దాపురం ఎమ్మెల్యే గా మూడవ సారి గెలుపొందిన నిమ్మకాయల చినరాజప్ప ను సామర్లకోట నాయీ బ్రాహ్మణులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ వృత్తి పరికరాలు అందజేశారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం పధకాలను అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఎమ్మెల్యే చిన రాజప్ప అన్నారు.