సామర్లకోట లొ పట్టపగలే చోరీ

73చూసినవారు
సామర్లకోట పట్టణ పరిధి ఉప్పు వారి వీధిలో దూళ్ల చంద్ర మౌళికి చెందిన తాళాలు వేసి ఇంటిలో మంగళవారం పట్ట పగలే చోరీ జరిగింది. తాళాలు వేసి బయటకు వెళ్లి గంటన్నర అనంతరం ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులకొట్టి తలుపులు తెరిచి ఉండడాన్ని యజమాని గుర్తించారు. తొలుత ఇచ్చిన సమాచారంతో భారీ చోరీ అని ఇవ్వడం తో కాకినాడ క్లూస్ టీం బృందం చేరుకుని దర్యాప్తు నిర్వహించారు. స్వల్ప విలువ గల బంగారపు ఆభరణాలు గల్లంతు అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్