పెద్దాపురంలో ఘనంగా అగ్ని మాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాలను సోమవారం ఏడీఎఫ్ఓ ఎమ్. శ్రీహరి జగన్నాధ్ జెండా ఊపి ప్రారంభించారు. అగ్ని మాపక కేంద్రం నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి, ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ కేవీవీ సత్యనారాయణ, పీఆర్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.