పంచారామ పుణ్య క్షేత్రమైన సామర్లకోట కూరా రామ భీమేశ్వరాలయంలో ఉపాలయంలో వెంచేసియున్న సప్తమాతృకలలో ఒకరైన
వారాహి అమ్మవారికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహనాధికారి బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో వారహి అమ్మవారికి ఆలయ పండితులు సోమేశ్వర శర్మ, అంజిబాబు, వెంకన్న, శ్రీనివాస రావు, వినయ్ ల వేదమాంత్రోత్సారణాల మధ్య పూజలు చేశారు. జిల్లా నాలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.