పెద్దాపురంలోని ఏడీబీ రోడ్డులో మంగళవారం ఇండస్ట్రియల్ పార్కు కు మంత్రి అనగాని సత్య ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, డీసీసీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి, కలెక్టర్ షణ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో 175 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టేందుకు అవకాశముందని, సుమారు 5 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు.