జి. మేడపాడు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటలకు తులసి దళాలతో విశేష పూజ జరిగింది. సాయంత్రం 4 గంటలకు హరే శ్రీనివాస భజన బృంద పర్యవేక్షణలో పటాని వెంకన్న దంపతుల సహకారంతో స్వామివారి మెట్ట వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పంచహారతి, నక్షత్ర హారతి, వేద ఆశీర్వచనంతో పూజలు జరిగాయని పూజారి సిహెచ్. సుధీర్ శర్మ తెలిపారు.