కడియం మండలం దుళ్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి వారికి ఆదివారం విశేషంగా పూర్ణాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చక స్వామి పెద్దింటి లక్ష్మణా చార్యులు ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.