పెద్దాపురంలో మరిడమ్మవారి ఉయ్యాల తాళ్ల ఉత్సవం

85చూసినవారు
పెద్దాపురంలో మరిడమ్మవారి ఉయ్యాల తాళ్ల ఉత్సవం
పెద్దాపురంలో మరిడమ్మవారి ఉయ్యాల తాళ్ల ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. నరికిన రెండు తాటి చెట్ల బానులను (మొద్దులను) యువకులు మోకు తాళ్లతో కట్టి, పొలాల నుంచి పాత పెద్దాపురం, మెయిన్ రోడ్డు, పురవీధుల మీదుగా అమ్మవారి ఆలయం వరకు మోసుకువచ్చారు. గరగల నృత్యాలు, డప్పుల దరువులు, బాజా భజంత్రీల నడుమ కనుల పండుగగా ఉత్సవం సాగింది. అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి ఉయ్యాల ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్