రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ఓటర్ల జాబితాపై దృష్టిసారించాలని పెద్దాపురం ఆర్డీవో కె. శ్రీరమణి అన్నారు. శుక్రవారం పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో పెద్దాపురం డివిజన్ లోని సహాయ ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అర్హులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏడు రోజుల్లో ఓటు నమోదుకై చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వివిధ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు.