పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ ప్రాంగణంసలో పాడి రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. గత 25 ఏళ్లుగా తమకు పామాయిల్ మడ్ ను కంపెనీ సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని బయటకు అమ్ముకుంటుందని రైతులు అన్నారు. పాత రేటుకే మళ్లీ రైతులందరికీ పామాయిల్ మడ్ ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు.