రానున్న వేసవి కాలం దృష్ట్యా అయా మునిసిపాలిటీల్లో ప్రజలకు కుళాయిల ద్వారా త్రాగునీటిని సరఫరా చేసే జలాశయాలకు గోదావరి జలాలు 20 రోజుల పాటు మల్లించేందుకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మునిసిపల్ కమిషనర్లను శుక్రవారం ఆదేశించారు. దీంతో సామర్లకోట పట్టణంలో సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ పట్టణాలకు త్రాగునీటిని సరఫరా చేసేందుకు నిల్వ చేసే రెండు జలాశయాలను కమిషనర్లు శుక్రవారం సాయంత్రం నుంచి సన్నద్ధం చేస్తున్నారు.