కార్తీకమాసం మహా పర్వదినాలు సందర్బంగా పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ముందుగా గోపూజలతో స్వామివారికి అభిషేక పూజలు చేసారు. లక్షపత్రి పూజల్లో ఉప్పాడ సురేష్ దంపతులు ఆశీనులయ్యారు. ఆకాశ దీప పూజలు, జ్యోతిర్లింగర్చన పూజలు చేసారు. భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేసారు.