తన కుమారుడు చనిపోయాడని అనుకోలేదని, కనిపించకుండా వెళ్లాడని అనుకున్నానని హత్యకు గురైన కిరణ్ కార్తీక్ తండ్రి వీర వెంకట్ కన్నీరు మున్నీరయ్యాడు. సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలోని హత్యా స్థలంలో శుక్రవారం ఆయన మాట్లాడాడు. తాను కిరణ్ ను మందలించానని, అందుకే కోపంతో వెళ్లిపోయాడనుకున్నానన్నాడు. కానీ తన కుమారుడిని హత్య చేశారని వాపోయాడు. తమ కుమారుడిని హత్య చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని వేడుకున్నాడు.