బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పటిష్టంగా పోరాటం చేయాలని పెద్దాపురం మున్సిపల్ ఇన్ ఛార్జ్ ఛైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన మిషన్ వాత్సల్య కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో నేతలు, అధికారులు బాల్య వివాహాల నిరోధానికి ప్రతిజ్ఞ చేశారు. మిషన్ వాత్సల్య విజయవంతం కావాలని ఆకాంక్షించారు.