పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో చేరేవారికి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నవోదయ వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణయ్య శుక్రవారం తెలిపారు. జనవరి 18న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 37 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కాకినాడ జిల్లాలో 14, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16, తూర్పుగోదావరి జిల్లాలో ఏడు కేంద్రాల్లో నిర్వహిస్తామని 8, 971 మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు.