సామర్లకోట లయన్స్ భీమేశ్వర క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం సాయంత్రం సామర్లకోట లయన్స్ క్లబ్ ఆవరణలో జిల్లా లయన్స్ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించనున్నట్లు చిత్తూలూరి రాజా తెలిపారు. క్లబ్ నూతన అధ్యక్షులుగా డాక్టర్ అమలకంటి శ్రీనివాస రావు, తదితర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ. 8 లక్షల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన భవనాలను ప్రారంభించనున్నట్లు చిత్తూలూరి రాజా తెలిపారు.