పెద్దాపురంలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారంతో 40వ రోజుకు చేరింది. తమ సమస్యలను పరిష్కారించాలని కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం. పల్లంరాజు మద్దతు తెలిపారు. ఫోన్ ద్వారా కార్మిక నాయకులతో మాట్లాడి తన సంఘీభావాన్ని ప్రకటించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట సోనీ కూడా సమ్మెకు సంఘీభావం తెలిపారు.