పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ సమావేశంలో భూమి, రెవెన్యూ సంబంధిత మూడు ఫిర్యాదులు వచ్చాయని ఆర్డీవో కె. శ్రీరమణి తెలిపారు. వాటిని సంబంధిత శాఖలకు పంపించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు త్వరగా తీర్చేందుకు పీజీఆర్ఎస్ వేదికగా ఉపయోగపడుతుందన్నారు.