పెద్దాపురం: నీటి పన్ను వసూలుకు స్పెషల్ డ్రైవ్

0చూసినవారు
పెద్దాపురం: నీటి పన్ను వసూలుకు స్పెషల్ డ్రైవ్
నీటి పన్ను వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని శనివారం పెద్దాపురం తహశీల్దారు సీహెచ్ వెంకటలక్ష్మి మీడియాకు తెలియజేశారు. గ్రామాల్లో రైతులు నీటి పన్నును గ్రామ సచివాలయాల్లో చెల్లించాలన్నారు. మండలంలో రూ. 1,51,38,116లకు గాను ఇప్పటివరకు రూ. 10.5 లక్షలు వసూలు అయిందన్నారు. మిగిలిన రైతులు వెంటనే చెల్లించాలని సూచించారు. ఆయా గ్రామాల వీఆర్వోలు డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్