పెద్దాపురంలో వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్ నుంచి దర్గా సెంటర్ వరకు ప్రధాన రహదారిలో విద్యుత్ వైర్లకు చెట్టు కొమ్మలు, తీగలు గుబురుగా అల్లుకుని ఉన్నాయి. వీటి వల్ల ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.