చెత్త నుంచి సంపద తయారీ సంపద కేంద్రాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప, కుడా ఛైర్మన్ తుమ్మల బాబుతో కలిసి ప్రారంభించారు. బుధవారం పెద్దాపురం మండలం రాయ భూపాలపట్నంలో చెత్త నుండి సంపద తయారీ సంపద కేంద్రం ప్రారంభం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప, కుడా ఛైర్మన్ బాబులు ఈ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నూనె రామారావు, తూతిక రాజు తదితరులు పాల్గొన్నారు.