'మార్లవను బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం'

82చూసినవారు
'మార్లవను బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం'
పెద్దాపురం మండలంలోని మార్లవ గ్రామాన్ని బాల్య వివాహ రహిత, బాలల స్నేహపూర్వక గ్రామంగా తీర్చిదిద్దుతామని సీడీపీవో అధికారులు అన్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో జి. ఉష తెలిపారు. మంగళవారం అంగన్వాడీ స్కూల్లో జరిగిన కిశోరి వికాసం వేసవి శిబిరం ముగింపులో ఆమె ప్రసంగించారు. కార్యక్రమంలో సర్పంచ్ టి. రామకృష్ణ, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బి. శ్రీనివాసరావు, సూపర్ వైజర్ ఎన్. ఉమాదేవి ఉన్నారు.

సంబంధిత పోస్ట్