జనసేనపార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి నాదెండ్ల

68చూసినవారు
పిఠాపురం మండలం చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ క్యాడర్ గురువారం సాయంత్రానికి చేరుకుంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆయన కాకినాడలోని పార్టీ కంట్రోల్ రూమ్ లో మీడియాతో మాట్లాడారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్